వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిక్కుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, గడ్కరీకి తలనొప్పి

అసమ్మతి నాయకులతో గడ్కరీ గురువారం రాత్రి కలిశారు. అయితే, ముఖ్యమంత్రి మార్చడానికి ఆయన ఇష్టపడడం లేదు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలను సాధించింది. దీంతో యెడ్యూరప్పను మార్చే ఉద్దేశం ఆయనకు లేదని చెబుతున్నారు. అసమ్మతి నాయకుల వ్యూహాన్ని యెడ్యూరప్ప ఈసారి ముందుగానే గడ్కరీకి, జాతీయ నాయకులకు అందించారు.
రాష్ట్ర మంత్రులు జగదీశ్ షెట్టర్, జనార్ద్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప, మాజీ మంత్రి అరుణ్ లింబవల్లి, ఎంపి ప్రహ్లాద్ జోషీ తదితరులు పార్టీ ప్రధాన కార్యదర్సి అనంతకుమార్ నివాసంలో సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర, జాతీయ నాయకుల తీరుపై గడ్కరీ చిరాకు పడుతున్నారు.