సెంటిమెంటు పరంగా విభజిస్తే దేశం వెయ్యి ముక్కలు: ఎంపీ కావూరి

పార్టీలో క్రమంగా విలువలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు విమర్శించనిది ఎవరిని అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులను మాత్రమే తెలంగాణ నేతలు విమర్శించలేదని అన్నారు. అంతకుముందు చాలామందిని విమర్శించారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా విమర్శించారన్నారు. దేశం మొత్తాన్ని సైంటిఫిక్‌గా ముక్కలు చేస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నేతలు అందరినీ తప్పుపడతారన్నారు.
శ్రీకృష్ణ కమిటీ సభ్యుల బాధ్యతలు, పరిధి వారికి తెలుసన్నారు. ఒకరు చెప్పవలసిన పని లేదన్నారు. 8వ చాప్టర్‌పై తనకు ఆనందం గానీ, ఆవేదన కానీ లేవన్నారు. నోరున్న వాళ్లు సెంటిమెంటు పేరుతే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమిపై కూడా ఆయన స్పందించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమన్నారు.












Click it and Unblock the Notifications