యాంగాన్: మయన్మార్‌లోని థాయ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల 25 మందికి పైగా మృతి చెందారు. పలు భవనాలు నేల కూలాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.8 గా నమోదయింది. బ్యాంకాక్, హనోయ్, చైనాలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూకంపం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జపాన్‌లో భూకంపం, వెనువెంటనే సునామీ సంభవించిన నేపథ్యంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
టార్లే పట్టణంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండవచ్చునని మయన్మార్ అధికారులు చెబుతున్నారు. మయన్మార్ భూకంపం వల్ల 11 మంది పురుషులు 13 మంది మహిళలు మరణించారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలు కావడం లేదని, రోడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో సహాయక బృందాలు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని మయన్మార్ అధికారులు చెప్పారు.
At least 25 people were killed and dozens of buildings destroyed when a strong earthquake struck Myanmar near the Thai border, according to information from officials in both countries on Friday.
Story first published: Friday, March 25, 2011, 9:22 [IST]