చిత్తూరు జిల్లా మదనపల్లెలో భూప్రకంపనలు, భయాందోళనలు
Districts
oi-Pratapreddy
By Pratap
|
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెలో, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. దాని తర్వాత పెద్దపెద్ద రాళ్లు కింద పడినట్టు శబ్దం రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. మదనపల్లె పట్టణంలోని పలు కాలనీలు, గ్రామీణ మండల పరిధిలోని గ్రామాల్లో కంపనాలను ప్రజలు గమనించారు.
కంపనాలు రాగానే తొలుత వంట పాత్రలు కదిలాయని, ఆ తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్లపాటు. భూమి కంపించిన నేపథ్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలతో పట్టణంలో తీవ్ర కలకలం చెలరేగింది.