వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీసా మోసాల ట్రైవ్యాలీలెన్నో, అమెరికా మోసాల దిబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri Valley University
వాషింగ్టన్: కాలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ వీసా మోసాల ఉదంతంలాంటివి అమెరికాలో చాలా జరుగుతున్నాయని, అటువంటి విశ్వవిద్యాలయాలు అమెరికాలో చాలా ఉన్నాయని క్రానికల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక తెలియజేస్తోంది. ట్రైవ్యాలీ వీసాల కుంభకోణం వల్ల వందలాది మంది భారతీయ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు చేరారు.

నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే అవకాశాలను చాలా విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. కాలిఫోర్నియా, వర్జీనియాల్లో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు చాలా ఉన్నాయని నివేదిక తెలియజేస్తోంది. వీసాలు ఇచ్చే అధికారం ఉండడంతో ఆ సంస్థలు వేలాది మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించి లక్షలాది డాలర్ల లాభాలను ఆర్జిస్తున్నాయని చెబుతోంది.

అమెరికాలో ఏ డిగ్రీ తీసుకున్నా సరే, తమ తమ దేశాల్లో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయని అమెరికాలోని విదేశీ విద్యార్థులు చెబుతున్నారు. దాంతో ఉద్యోగాలు చేస్తూ వీకెండులో మాత్రమే తరగతులకు వెళ్లే అవకాశం కల్పిస్తున్న ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో చేరుతుతున్నారని నివేదిక సారాంశం.

English summary
A visa scam at Tri Valley University in California, that has affected hundreds of Indian students, is just the tip of an iceberg and a large number of such institutes exit in the US, a probe report here has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X