రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 38 కోట్ల విలువ చేసే భూమే లాయర్ హత్యకు కారణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని నానక్‌రాం గుడాలో గల 38 కోట్ల రూపాయల విలువైన భూమే న్యాయవాది అశోక్ రెడ్డి హత్యకు కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల తహిశీల్ కార్యాలయం వద్ద అశోక్ రెడ్డి అనే న్యాయవాదిని నలుగురు వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి వచ్చిన అశోక్ రెడ్డిని హత్య చేశారని తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుడి కుమారుడు రవికుమార్ యాదవ్ హస్తం హత్య వెనక ఉందని అశోక్ రెడ్డి బంధువు కృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నాడు.

సంజీవరెడ్డి, దశరథ రెడ్డిలకు మధ్య చాలా కాలంగా భూవివాదం చెలరేగుతోంది. సంజీవ రెడ్డి తరఫున ఆశోక్ రెడ్డి కేసు వాదిస్తున్నాడు. ఈ కేసులో తాము ఓడిపోతున్నామనే కక్షతో సంజీవ రెడ్డికి చెందిన దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అశోక్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

English summary
It is learnt that lawyer Ashok Reddy is murdered an land dispute costs about Rs 38 crores at Nanakramguda. It is said that four persons were surrendered before police in murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X