వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మావోయిస్టు నేత, తెరాస నాయకుడు సాంబశివుడు హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sambasivudu
నల్లగొండ: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత సాంబశివుడిని శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో మరో పది మందితో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం వద్ద రెండు కార్లలో వచ్చిన పదిమంది వేటకొడవళు, గొడ్డళ్లతో దాడి చేశారు. సాంబశివుడు నల్లగొండ జిల్లాకు చెందినవారే.

ఈ సంఘటనలో సాంబశివుడు, తెరాస మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వలిగొండ ఆస్పత్రికి తరలించారు.సాంబశివుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సాంబశివుడు పోలీసులకు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్నాడు. ఆయన ఆ మధ్య కాలంలో తెరాసలో చేరారు.

English summary
Ex Maoist leader Sambasivudu killed in near Valigonda of Nalgonda district. Unidentified persons attacked Sambasivudu's vehicle and killed him. Sambasivudu recently joined in TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X