వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ దౌత్యం, సెమీ ఫైనల్ మ్యాచుకు పాక్ ప్రధాని గిలానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: భారత, పాకిస్తాన్‌ల మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచుకు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ రానున్నారు. మొహాలీలో జరిగే ఈ మ్యాచును భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి వీక్షిస్తారు. మార్చి 30వ తేదీన జరిగే ఆ మ్యాచును తిలకించడానికి రావాల్సిందిగా గిలానీని మన్మోహన్ సింగ్ ఆహ్వానించారు. మన్మోహన్ ఆహ్వానాన్ని గిలానీ మన్నించారు.

గిలానీతో శనివారం అర్థరాత్రి రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో గిలానీ మన్మోహన్ సింగ్ ఆహ్వానాన్ని మన్నించాలని నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని మన్మోహన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్, ఇండియాల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచును చూడడానికి ఇండియా రావడానికి గిలానీ అంగీకరించారని అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ చెప్పారు. మ్యాచు చూసేందుకు రావాలని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని, ప్రధాని గిలానీని ఆహ్వానించారు.

క్రికెట్ దౌత్యంలో భాగంగా గిలానీ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారని పాకిస్తాన్ వార్తాపత్రికలు రాశాయి. మ్యాచుకు ముందు గిలానీ మన్మోహన్ సింగ్‌ను అనధికారికంగా కలుస్తారని, మ్యాచు పూర్తయిన తర్వాత అధికారిక సమావేశం జరుగుతుందని రాశాయి. దౌత్య మార్గాల ద్వారా గిలానీ భారత పర్యటన గురించి భారత్‌కు తెలియజేశారు.

English summary
Pakistan premier Yousuf Raza Gilani on Sunday accepted his Indian counterpart Manmohan Singh's invitation to watch the World Cup semifinal between the cricket teams of the two countries at Mohali on March 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X