వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంబశివుడి హత్య కేసులో పురోగతి, కారును కనిపెట్టిన పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు సాంబశివుడు అలియాస్ ఐలయ్య హత్య కేసులో పోలీసులు ఆదివారం కొంత పురోగతి సాధించారు. సాంబశివుడు హత్యకు వాడిన కారును పోలీసులు చౌటుప్పల్‌‌ వద్ద హత్య జరిగిన చోటికి 20 కిలోమీటర్ల దూరంలో ఓ పాఠశాల వెనక కనుక్కున్నారు. ఈ మారుతి 800 కారుపై రక్తం మరకలు ఉండడం, దాన్ని పక్కకి నెట్టేసి కనిపించకుండా పెట్టడంతో ఇదే కారును సాంబశివుడి హత్యకు వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పైగా, కారులో ఓ కత్తి లభ్యమైంది. మద్యం సీసాలు కూడా కారులో ఉన్నాయి.

సాంబశివుడి మృతదేహంపై 20 కత్తిపోట్లున్నాయి. కాగా, సాంబశివుడి హత్యకు మరో కారును పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. సాంబశివుడి హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కనుక్కున్న కారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గల శాలిజార్జి ప్రాంతం చిరునామా మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ కారును ఓ బ్యాంకులో రుణం తీసుకుని కొన్నట్లు తెలుస్తోంది. కారు నెంబర్ ఎపి 28 ఎజి 3661.

English summary
Police found a car used in Samabasivudu's murder at Choutuppal of Nalgonda district. Blood spots are found on the body of the Maruthi 800 car and knife was found inside the car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X