వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలుపెరుగని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మబిక్షం మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bommagani Dharmabiksham
నల్లగొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్‌ నేత బొమ్మగాని ధర్మభిక్షం శనివారం కన్నుమూశారు. ఇటీవల ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 89 ఏళ్లు.

నల్గొండ జిల్లా మునుగోడు మండలం వూకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట 15 ఫిబ్రవరి 1922న ధర్మభిక్షం జన్మించారు. వారి కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండల్లో పని చేశారు.

నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టె ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై భారీ మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం అనంతరం 1957, 1962లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991, 96లలో నల్గొండ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.

English summary
Prominent CPI leader Bommagani Dharmabiksham passed away on saturday. He actively participated in Telangana armed struggle aged against earstwhile Nizam regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X