హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీతో హసన్ అలీకి లింకేంటి: టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీకి ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీ, సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సంబంధాలు ఉన్నాయన్న విషయంలో వాస్తవాలు బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులతో హసన్ అలీకి సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో వారి పేర్లు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి పేర్లు ఉన్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

అలీ ఏయే ప్రాంతీయ పార్టీలకు డబ్బు ఇచ్చారో కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో హసన్ అలీ ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. గుర్రాలు పెంచే అలీకి వేలాది కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. హసన్ అలీకి ప్రాణ హానీ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. యూపిఏ సర్కారు హయాంలో దేశంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

English summary
TDP president Chandrababu Naidu demand to reveal AICC president Sonia Gandhi links with Hasan Ali. He demanded to to reveal the names who is linked with Ali from south states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X