వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మావోయిస్టు నేత సాంబశివుడి హత్యకు హైదరాబాద్ లింక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sambasivudu
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు సాంబశివుడి హత్యకు హైదరాబాదు లింకలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాదులోని మాదాపూర్‌లో, నల్లగొండ జిల్లాలోని బీబీనగర్ ప్రాంతంలో భూవివాదాలు కూడా సాంబశివుడి హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సందర్భంలో అన్వర్ అనే పేరు వినిపించిందని సంఘటనా స్థలంలో ఉన్న ఓ తెరాస నేత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనక అన్వర్ అనే వ్యక్తి ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అన్వర్ ఎవరనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

హంతకులు హిందీలో మాట్లాడినట్లు కూడా సాంబశివుడి వెంట ఉన్నవారు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, సాంబశివుడి హత్య వెనక ప్రభుత్వ పాత్ర ఉందనే తెరాస నాయకుల విమర్శలను నల్లగొండ ఎస్పీ రాజేష్ కుమార్ ఖండించారు. సాంబశివుడి హత్య వెనక ప్రభుత్వం గానీ, పోలీసు యంత్రాంగం గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. సాంబశివుడి హత్యకు పలు కారణాలు ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు అతనికి గల విభేదాలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చునని ఆయన అన్నారు. భూవివాదాలు కూడా కారణమై ఉండవచ్చునని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో సాంబశివుడి హత్య కేసును ఛేదిస్తామని ఆయన చెప్పారు. కాగా, సాంబశివుడి హత్యకు నిరసనగా తెరాస సోమవారం నల్లగొండ జిల్లాకు బంద్ నిర్వహిస్తోంది.

English summary
It is suspected that land dispute may be the main reason for TRS leader Sambasivudu's murder. Nalgonda district SP Rajesh kumar condemned TRS leaders allegations on Sambasivudu's murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X