వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు చూడనున్న సోనియా గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: మొహాలీలో పాకిస్తాన్, భారత్ మధ్య ఈ నెల 30వ తేదీన జరిగే సెమీ ఫైనల్ మ్యాచును కాంగ్రెసు అధ్యక్షురాలు, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా చూడనున్నారు. ఈ మేరకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీ కూడా మ్యాచును వీక్షించనున్నారు. ఈ మ్యాచు భారత, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరుస్తుందని భావిస్తున్నారు. కాగా, మొహాలీ మ్యాచుకు వివిఐపిల తాకిడి పెరిగింది. చండీఘర్‌లోని హోటళ్లన్నీ ఎప్పుడో నిండిపోయాయి.

పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచుకు దాదాపు 60 మంది పార్లమెంటు సభ్యులు వెళ్తారని భావిస్తున్నారు. వీరిలో నలుగురైదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ఉంటారు. కేంద్ర మంత్రులు కూడా పలువురు ఈ మ్యాచుకు వెళ్లే అవకాశాలున్నాయి. పలువురు వివిఐపిలు ఈ మ్యాచుకు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

చండీఘర్, మొహాలీ, పంచకుల సాయుధ బలగాలతో నిండిపోయాయి. వ్యూహాత్మకంగా విమాన నిరోధక గన్‌లను ఏర్పాటు చేశారు. మొహాలిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. భారత వైమానిక దళాల హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. ఫైటర్ జెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. బహుళ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ బలగాలు ఇప్పటికే మోహరించాయి.

English summary
Congress president Sonia Gandhi to attend Mohali match to be held between pakistan and India. semi final match of Cricket World cup between pakistan and India to be held om March 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X