హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హసన్ అలీతో లింక్ చంద్రబాబుకేనా?, చిరునూ వదలని సాక్షి డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: నల్లదనం కేసులో నిందితుడు హసన్ అలీ వెల్లడించిన అంశాలను ఆసరా చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ నేరుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మీదికి బాణాలు విసిరింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డబ్బులను తానే హ్యాండిల్ చేశానని హసన్ అలీ చెప్పిన విషయాలపై వ్యాఖ్యానిస్తూ పరోక్షంగానైనా చంద్రబాబును హసన్ అలీ వేలెత్తి చూపించాడని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. ఈ మేరకు పతాక శీర్షికన సాక్షి డైలీ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. హసన్ అలీ వ్యవహారాలను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికీ లింక్ పెట్టింది.

మాజీ ముఖ్యమంత్రి 2004 నాటికే భారీగా నల్లధనం దాచుకున్నారని హసన్ అలీ చెప్పిన విషయంపై సాక్షి డైలీ వ్యాఖ్యానిస్తూ 2004కు ముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నది చంద్రబాబే అని తేల్చింది. చంద్రబాబుతో పోరాడిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి హోదా లేదని స్పష్టం చేసింది. చంద్రబాబు దుబాయ్ సంబంధాలు హసన్ అలీ వ్యవహారంతో బయటపడిందని వ్యాఖ్యానించింది. ఇదంతా బయటపడుతుందనే భయంతో ముందుగానే చంద్రబాబు ఎదురు దాడికి దిగారని, తన పేరు స్పష్టంగా బయటపడిపోయిందని తెలిసి చంద్రబాబు తోక ముడిచారని చెప్పింది. నాయకుడిగా మారిన నటుడంటూ చిరంజీవి గుట్టును కూడా హసన్ అలీ బయటపెట్టాడని సాక్షి వ్యాఖ్యానించింది. సాక్షి డైలీ తన వార్తాకథనంలో చంద్రబాబు కడిగి ఆరేసింది.

English summary
Sakshi daily belongs to YSR Congress leader YS Jagan, blamed ex CM Chandrababu in Hasan Ali issue. It alleged that Hasan Ali named none other than Chandrababu in his revelation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X