వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ నేత సాంబశివుడు హత్య కేసులో 4గురు లొంగుబాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sambasivudu
నల్గొండ: మాజీ నక్సలైటు, తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడు హత్య కేసులో తామే నిందితులం అంటూ నలుగురు వ్యక్తులు మంగళవారం నల్గొండ జిల్లా చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఆ నలుగురు తమకు తామే పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. వీరు రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని చౌటుప్పల్ నుండి నారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.

కాగా ఇటీవల నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాదు తిరిగి వస్తున్న సాంబశివుడును ఆ రోజు అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి కత్తులతో పొడిచిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సాంబశివుడు తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన శరీరంలో 20 కత్తిపోట్లు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

English summary
Four accused surrendered in Choutuppal police station today in Maoist and TRS leader Sambasivudu's murder case. They were sent to Narayanapur police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X