హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై అసెంబ్లీలో చంద్రబాబు దాడి: అడ్డుకున్న ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: భూకేటాయింపులపై శాసనసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్‌పై విమర్శల జడివాన కురిపించారు. చంద్రబాబు తమ నాయకుడిని పేరును ప్రస్తావించినప్పుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రసంగానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం, వైయస్ వర్గం శాసనసభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హసన్ అలీ మీ డబ్బులను ప్రపంచమంతా ఎలా తిప్పుతున్నాడో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ వర్గం శాసనసభ్యులను మీది ఏ పార్టీ అంటూ ఆయన ప్రశ్నించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని మనుషులు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వారికి తాను బెదిరిపోనని ఆయన అన్నారు. వారికి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎంపిటిసిని 15 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోచుకునే హక్కు లేదని ఆయన అన్నారు.

ఈ సమయంలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ - వైయస్ జగన్‌కు భయపడి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సరి కాదని ఆయన అన్నారు. భూకేటాయింపులపై కమిటీ వేస్తే తమకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. అయితే, ఆ కమిటీ ఏయే అంశాలపై విచారణ చేయాలో తాము ఇది వరకే చెప్పామని ఆమె అన్నారు. జగన్ తన తండ్రి ద్వారా భూములు కేటాయింపజేసి తన సంస్థల్లోకి పెట్టుబడులను పెట్టించుకున్నారని ఆదాయం పన్ను శాఖ స్పష్టంగా చెప్పిందని, తాను చెప్పడం లేదని ఆయన అన్నారు. తనపై పత్రిక ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీకు చేతనైతే రాజీనామాలు చేయాలని ఆయన జగన్ వర్గం శాసనసభ్యులు సవాల్ చేశారు. ఒక్క పార్టీ పేరున గెలిచి మరొకరిని బలపరుస్తున్నారని ఆయన అన్నారు.

English summary
YS Jagan camp MLAs obstructed opposition leader N Chandrababu Naidu's speech in assembly during debate on land allocations. Chandrababu retaliated YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X