చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్యూటీ సిఎం స్టాలిన్‌పై జెపి లోక్‌సత్తా పోటీ: తమిళ బరిలో ఎమ్మెస్కే

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలోని లోక్‌సత్తా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 235 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి 40 స్థానాల నుండి లోక్‌సత్తా పోటీ చేస్తోంది. అయితే ఆ నలభై స్థానాలలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న స్టాలిన్ నియోజకవర్గం కూడా ఉంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కొళత్తూరు నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఇదే నియోజకవర్గం నుండి లోక్‌సత్తా పార్టీకి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, జాతీయ అవార్డు గెలుచుకున్న అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు.

అయితే తమిళనాడులో లోక్‌సత్తా మక్కల్ శక్తి కట్చి పేరుతో బరిలోకి దిగుతోంది. అంతేకాదు ఇప్పటికే ప్రచారం రంగంలోకి దిగిన అశోక్ కుమార్ ఇటు అన్నాడిఎంకె, అటు అధికార డిఎంకె పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడంట. ఇటీవలే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెన్నైలో పర్యటించి వారికి ఈల గుర్తును అందజేశారు.

English summary
Loksatta Party contesting from 40 constituencies in Tamilnadu as Makkal Shakti Katchi. Ashok Kumar is contesting on deputy CM Stalin from Kolattor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X