హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగనా, చంద్రబాబా తేల్చుకోవాలి: ఉప ఎన్నికలపై సిపిఎం రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలా లేక మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకాలా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు గురువారం అన్నారు. త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు జరిగే ఎన్నికల్లో జగన్‌కు లేదా చంద్రబాబుకు మద్దతు తెలిపే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

తాము కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులమని చెప్పారు. కాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారాన్ని వేస్తుందని అన్నారు. ఛార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం, శనివారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని ఆయన సిపిఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

English summary
CPM state secretary BV Raghavulu said that they were not decided to support Ex MP Jagan or Telugudesam in by election in Kadapa and Pulivendula. He said they opposed congress and bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X