వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ స్కామ్: ఎ రాజాపై చార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో టెలికం మాజీ మంత్రి ఎ రాజాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రత్యేక కోర్టు ముందు తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఏడు పెట్టెల్లో సీల్ చేసిన 80 వేల పేజీల చార్జిషీట్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీకి అందజేసింది. ఎ రాజా, ఆయన వ్యక్తిగత సహాయకుడు చండోలియా, టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరియా, ఎటిస్లాట్ డిబి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ షాహిద్ ఉస్మాన్ బల్వాలపై నేరారోపణలు చేస్తూ సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం.

కేసు నిందితుల్లో డిబి రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ గోయంకా, యూనిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజా చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కింద నేరారోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిబిఐ ఇది వరకు చెప్పింది. ప్రభుత్వానికి జరిగిన నష్టం అంచనాను చార్జిషీట్‌లో చేర్చలేదని తెలుస్తోంది.

English summary
The Central Bureau of Investigation (CBI), Saturday, filed a charge sheet in the 2G spectrum scam case before a special court here. The 80,000 page charge sheet, seal-packed in seven boxes, was submitted before the special court of Justice OP Saini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X