విజయమ్మపై పోటీకి ఆమె సైతం: వివేకా కాదంటే సిద్ధపడిన భార్య?

వివేకా తన వదిన విజయమ్మపై పులివెందులను నుండి పోటీ చేస్తానని చెప్పడంతో పార్లమెంటు సభ్యత్వానికి పలువురిని పరిశీలిస్తున్నారు. అయితే పులివెందుల నుండి వివేకా పోటీ చేయకుంటే వదిలి పెట్టాలని కాంగ్రెసు భావించినప్పటికీ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం అందుకు ససేమీరా అన్నదంట. విజయమ్మపై తన భర్త వివేకా పోటీ చేయకుంటే స్వయంగా విజయమ్మపై పోటీ చేయడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. కాగా విజయమ్మపై పోటీపై ప్రశ్నించిన వారికి మరో ప్రశ్న సంధిస్తున్నారు. విజయమ్మపై పోటీ నుండి తనను తప్పుకోమని చెప్పేవారు జగన్‌పై మా కుటుంబానికి చెందిన ఆడవారు పోటీ చేస్తే తప్పుకుంటారా అని ఎదురు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.