కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఎన్నికలలో 5గురు జగన్‌లు: అధికార కాంగ్రెసు వ్యూహం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెసు పార్టీ వ్యూహాలు పన్నుతున్నది. స్థానిక శాసనమండలి ఎన్నికల కోసమే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి వ్యూహం రచించినప్పటికీ కొద్ది తేడాతో జగన్ వర్గం నేత ఎమ్మెల్సీగా గెలిచాడు. శాననమండలి ఎన్నికలలో కడపలో విజయాన్ని తృటిలో కోల్పోయినప్పటికీ ఉప ఎన్నికలను మాత్రం అధికార కాంగ్రెసు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇన్నాళ్లు వారు కాంగ్రెసుతో ఉండటంతో గత ముప్పయ్యేళ్లుగా ఆ కుటుంబానికి చెందిన వారే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు.

అయితే వైయస్ మరణం తర్వాత జగన్ పార్టీని వీడిపోవడంతో కాంగ్రెసు అక్కడ తమ పట్టు కోల్పోకుండా ఉండే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా ప్రజలు కాంగ్రెసుతోనే ఉన్నారన్న ఉద్దేశ్యాన్ని రాష్ట్రంలో కల్పించడానికి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు సవాలుగా నిలిచాయి. అయితే జగన్ బాబాయి వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసు వైపే ఉండటం కాస్త కాంగ్రెసుకు లాభం చేకూర్చే విషయమే అయినప్పటికీ శాసనమండలి ఎన్నికలలో ఓటమితో మరింత పకడ్బందీగా కడప పార్లమెంటునుండి జగన్‌ను, పులివెందులనుండి విజయమ్మను ఓడించేందుకు కాంగ్రెసు వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జగన్‌ను ఓడించడానికి కాంగ్రెసు అభ్యర్థితో పాటు మరో నలుగురిని బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు కాంగ్రెసు నేతలు ఆ నియోజకవర్గంలో జగన్ పేరుతో ఉన్న వారి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పేరుతో ఉన్న వారిని మరో నలుగురిని బరిలోకి దింపి ఓటర్లను గందరగోళ పరిస్థితిలోకి నెట్టే ఉద్దేశ్యంలో అధికార కాంగ్రెసు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జగన్‌కు పడే ఓట్లలో కొన్నింటిని అయినా చీల్చవచ్చని, దాని ద్వారా లాభపడవచ్చునని అధికార పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెసు, జగన్ వ్యూహ ప్రతివ్యూహాలలో ఎవరి వ్యూహం బెడిసి కొడుతుందో లేక వీరిద్దరి వ్యూహాల మధ్య టిడిపి లాభ పడుతుందో ఎన్నికల అనంతరం తెలుస్తుంది.

English summary
It seems, ruling congress chalked out strategy to defeat Ex MP YS Jagan in Kadapa byelection. Congress is thinking to put as candiadates similar to Jagan name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X