వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగోలో యుఎన్ విమానం కూలి 32 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congo Plane crash
కిన్షాసా: కాంగో రాజధాని నగరం కిన్షాసా విమానాశ్రయంలో దిగబోతూ ఐక్యరాజ్య సమితి (యుఎన్) విమానం ఒకటి కుప్పకూలింది. విమానంలో మొత్తం 33 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సమితి అధికారులు తెలిపారు. మరణించినవారిలో 20 మంది సమితి ఉద్యోగులేనని, సమితికి సంబంధించిన రవాణా విమానం ఒకటి ఈస్థాయిలో ప్రమాదానికి గురికావడం ఇదే ప్రథమమన్నారు.

సమితి అధికారులు, శాంతి స్థాపనకు కృషిచేసే కార్యకర్తలు ఉన్న ఈ విమానం కాంగోలోని మరో నగరం నుంచి కిన్షాసాకి వచ్చింది. విమానం దిగబోతూ ఒక్కసారిగా కుప్పకూలి రెండుగా విడిపోయి కాలిపోయిందని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. బతికి బయటపడిన ఆ ఒక్క వ్యక్తి వివరాలు తెలియవని యుఎన్ పీస్ కీపింగ్ చీఫ్ అలైన్ లే రాయ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

English summary
Only one person survived among the 33 UN personnel and crew members aboard a plane that crashed in Congo, UN officials said. UN peacekeeping chief Alain Le Roy told reporters he had no detailed information about the sole survivor, who he said was hospitalised after the crash in the Congolese city of Kinshasa yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X