వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం దిగి వచ్చే వరకు దీక్ష విరమించేది లేదు: అన్నా హజారే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదించే వరకు తాను నిరాహార దీక్షను విరమించేది లేదని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే బుధవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో లోక్‌పాల్ బిల్లుపై తాను చర్చలు జరపాలని యోచించానని అయితే కేంద్రం అందుకు సానుకూలంగా లేదన్నారు. లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాడటం లేదన్నారు. తనకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. దేశం కోసం ఎంతవరకైనా పోరాడుతానని చెప్పారు.

ముసాయిదా లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. మేధావులు అందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా అన్నా హజారే చేపట్టిన దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది. పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు ఆయనకు మద్దతు తెలిపారు. విపక్షాలు సైతం ఆయనకు అండగా నిలబడినాయి. హజారే దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు దీక్షలు ప్రారంభించారు.

English summary
Anna Hazare said that he will not withdraw his fast until central government accept Lokpal bill. He said he is fighting for country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X