వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెట్‌లో అమ్మాయిల నగ్న చిత్రాలు: ఓ కోచింగ్ టీచర్ నిర్వాకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: తన వద్దకు కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థినులకు చదువు చెప్పే బదులు వారి నగ్న చిత్రాలను తీసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని యలమంచిలిలో ప్రకాశ్ అనే అతడు అయ్యప్ప కోచింగ్ సెంటర్ పేరిట ఓ కోచింగ్ సంస్థను నిర్వహిస్తున్నారు. కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిలను బెదిరించి లోబర్చుకునేవాడు. వారి నగ్న చిత్రాలను అమ్మాయిలకు తెలియకుండా తీసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వాటిని తన పర్సనల్ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసేవాడు.

తర్వాత ఆ ఆ అమ్మాయిల నగ్న చిత్రాలను వారికి చూపించి నిత్యం వారిని వేధింపులకు గురి చేసేవాడు. ట్యూషన్‌కు వచ్చే విద్యార్థినులలో చాలామంది నగ్న చిత్రాలను ఈ కీచక గురువు తీశాడు. అనంతరం వాటిని ఇంటర్‌నెట్‌లో కూడా పెట్టాడు. ఈ మధ్య ఆయన కంప్యూటర్ చెడిపోతే హార్డ్‌వేర్ వచ్చి కంప్యూటర్‌లో నిక్షిప్తం అయిన అమ్మాయిల నగ్న చిత్రాలను తీసుకు వెళ్లి మార్కెట్లోకి సిడిలుగా కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. టీచర్ నిర్వాకానికి వ్యతిరేకంగా పలువురు ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.

అయితే ఇప్పటి వరకు బాధితులు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని ఆవేదన చెందారు. కానీ ఇటు ఇంటర్‌నెట్‌లో, అటు సీడిలుగా బయటకు వస్తుంటే వారు పోలీసులను ఆశ్రయించారు. మొదట అంతగా పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది. అయితే ఓ ఎలక్ర్టానికి ఛానల్‌లో ప్రముఖంగా కథనం ప్రసారం కావడంతో పోలీసులు స్పందించినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ప్రకాశ్ పరారు కావడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అమ్మాయిల నగ్న చిత్రాలు ఉన్న సెల్‌పోన్‌లను, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Police arrested today coaching centre institute organizer Prakash for sexual harassment in Vishakapatnam. He was captured girl students nude pictures in his cell phones and put in internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X