హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ లక్ష్యంగా పిజెఆర్ తనయుడు ఎమ్మెల్యే విష్ణు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: జూబ్లిహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఓ లేఖ రాశారు. ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి.జనార్ధన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రికి వైయస్ రాజశేఖరరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. స్వపక్షంలో ఉంటూనే ప్రతిపక్ష సభ్యుడిగా పిజెఆర్ వైయస్‌ను ముప్పుతిప్పలు పెట్టేవారు. ఇప్పుడు వారి తనయులు అదే బాటలో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే జగన్ పార్టీనుండి బయటకు వెళ్లిన తర్వాత పిజెఆర్ తనయుడు పివిఆర్ జగన్ విషయంపై సోనియాకు ఓ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.

జగన్‌కు కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు పలువురు మంత్రుల మద్దతు కూడా ఉందని పివిఆర్ సోనియాకు రాసిన బహిరంగ లేఖలో చెప్పారు. జగన్ వెంట వెళుతున్న మంత్రులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైయస్ పాలన అవినీతిమయంగా సాగిందని, సంక్షేమ పథకాల ముసుగులో దాన్నంతా మూసి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైయస్ మరణానంతరం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సాగిన సంతకాల సేకరణలో తాను పాల్గొనలేదని, సంతకం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడూ పరిగణించలేదన్నారు. ఆయనపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కొందరు పనిగట్టుకొని జగన్‌తో ప్రచారం చేయించారని ఆయతే ఫలితం మాత్రం కనిపించలేదన్నారు. తన నియోజకవర్గంలో మాత్రం జగన్ పర్యటించకుండా నిరోధించానని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో బాహాటంగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెసు ఓటమికి కారణమయ్యారని, అలాంటి వారితో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరించే మంత్రులపై చర్యలు తీసుకోవాలని పివిఆర్ కోరారు. జగన్ వర్గం నేతలపై సిఎం కిరణ్ కఠినంగానే ఉన్నారని అయితే మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు.

English summary
Late P Janardhan Reddy's son MLA P Vishnuvardhan Reddy targeted Ex MP YS Jaganmohan Reddy. He wrote a letter to AICC president Sonia Gandhi about Jagan issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X