చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెలికం మాజీ మంత్రి ఎ రాజా సమీప బంధువు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
చెన్నై: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ రాజా సమీప బంధువు బుధవారం మరణించాడు. ఆల్వార్‌పేటలోని జిమ్‌లో 30 ఏళ్ల దీపక్ గుండెపోటుతో మరణించినట్లు మరణించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు ఏ విధమైన కేసు నమోదు చేయలేదు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దీపక్ ఇంటిలో కూడా డిసెంబర్‌లో సోదాలు నిర్వహించారు.

జిమ్ చేస్తుండగా దీపక్‌ తనకు ఛాతీలో నొప్పి వస్తోందని ఇన్‌స్ట్రక్టర్‌కు చెప్పాడు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా అతనికి సూచించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై దీపక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయలేదు. అందువల్లనే తాము కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు.

దీపక్ మృతి పట్ల వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తే తాము విచారణ చేపడతామని మైలాపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్ రాజేంద్రన్ చెప్పారు. సహజ మరణమే అయితే ఏ విధమైన కేసు ఉండదని ఆయన చెప్పారు.

English summary
Deepak (30), a nephew of former Union minister A Raja, died reportedly of cardiac arrest while working out at a gym in Alwarpet on Wednesday, police said. Police have not registered a case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X