హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలపై లాఠీఛార్జ్ చేసిన ఎస్‌ఐ త్రిపాఠి సస్పెన్షన్: హోంమంత్రి సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: విజయనగరం జిల్లాలో ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీఛార్జ్‌పై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని హోంమంత్రి సబితారెడ్డి గురువారం ఖండించారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు, సిఐపై చర్యలు తీసుకుంటామని సబితారెడ్డి అన్నారు. సిఐపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎస్ఐ త్రిపాఠిని వెంటనే సస్పండ్ చేసినట్టు చెప్పారు. కాగా సిఐ మహిళా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన ఎస్ఐ త్రిపాఠి, పోలీసులపై శాఖాపమైన చర్యలు తీసుకుంటామని డిజిపి అరవిందరావు చెప్పారు. సంఘటనపై పూర్తి నివేదిక పంపించాలని జిల్లా ఎస్పీ నవీన్ గులాటీని ఆదేశించారు.

కాగా సస్పెన్షన్‌తో సరిపుచ్చకుండా సదరు పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న స్త్రీలపై పోలీసులు దాడి చేయడాన్ని వారు ఖండించారు. పోలీసులు వెళ్లిపొమ్మని చెప్పడంతో వెళ్లిపోతున్న మహిళలను కూడా వెంట పడి కొట్టారన్నారు. కాగా జీతాలు పెంచాలంటూ ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై ఉదయం పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన విషయం తెలిసిందే.

తమకు జీతాలు పెంచాలంటూ సుమారు రెండువందల మంది ఆశా వర్కర్లు విజయనగరం జిల్లా డిఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఉదయం ఆందోళనకు దిగారు. తమకు జీతాలు పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు వారిని అక్కడ నుండి పంపించడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలితం ఇవ్వక పోవడంతో పోలీసులు మహిళలా వర్కర్లపై లాఠీఛార్జ్ చేశారు. మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్‌తో విరుచుకు పడి వారిని పంపించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు లాఠీఛార్జ్ కారణంగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

English summary
Police make lathi charge on Asha workers today in Vijayanagaram. Men police charged on women workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X