హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సన్నిహితుల మాటతో జగన్‌పై పోటీకి కందుల వెనక్కి తగ్గుతారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెసు పార్టీ నుండి కడప పార్లమెంటులో బరిలోకి దిగుతాడని అనుకుంటున్న కడప జిల్లా సీనియర్ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి చివరి నిమిషంలో పోటీలో ఉండటానికి ఆసక్తి లేదని చెప్పే అవకాశం ఉందా అంటే కావచ్చునని పలువురు అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతి ఓట్లు పడే అవకాశమున్నందున, అక్కడ గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబానిది ఆధిపత్యం ఉన్నందున పోటీలో ఉండక పోవడమే సబబని కందులకు చెందిన కొందరు సన్నిహితులు వారిస్తున్నట్టుగా తెలుస్తోంది.

బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కాంగ్రెసుకు ఏమాత్రం పట్టులేదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా ఉండటమే బెటర్ అని వారు కందులను హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో గట్టి పోటీ అనుకున్న దివంగత వైయస్‌ పైనే లోకసభ స్థానానికి పోటీ చేసి ఆయనను ఓటమి అంచులోకి తీసుకు వెళ్లారని అయితే జగన్‌పై పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో కందుల రాజమోహన్ రెడ్డి సోదరుడు కందుల శివానందరెడ్డి పోటీకే సై అంటున్నట్టుగా తెలుస్తోంది.

వైయస్ కుటుంబంతో ఢీకొట్టి గెలిచే అవకాశాలున్నాయని శివానంద అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తమకు మంచి పట్టు ఉందని, కాంగ్రెసు టిక్కెట్ ఇస్తే కాంగ్రెసు ఓటింగు జత కలిసి గెలవడం ఖాయమని శివానందరెడ్డి అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పోటీ చేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అయితే వీరు తమ సన్నిహితులతో భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ చేస్తామని ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గితే బావుండదని, అయినా గెలుపు ఖాయంగా కనిపిస్తున్నందున తప్పుకోవడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
It seems Kandula Rajamohan Reddy will step back from byelection. Some of his friends suggesting him to do not contest from Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X