వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిపరులు జైలుకు వెళ్లారా, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం: అన్నాహజారే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: మన దేశంలో అవినీతికి పాల్పడ్డ మంత్రులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఇప్పటి వరకు జైలుకు వెళ్లారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అవినీతిని అంతమొందించడానికి జన్ లోక్‌పాల్ బిల్లును తేవాలంటూ ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే చేపట్టిన దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జన్ లోక్‌పాల్ బిల్లుకోసం పోరాటం చేస్తానని చెప్పారు. తనను జన్ లోక్‌పాల్ సమన్వయ కమిటీ చైర్మన్‌గా కేంద్రం నిరాకరించడాన్ని ప్రస్తావిస్తూ తాను ఇప్పటి వరకూ ఏ కమిటీలోను సభ్యుడిగా లేనని, ఇక ముందు కూడా ఉండనని చెప్పారు.

కొత్త కమిటీలో ఉండాలని లేదని, కానీ ఆ బిల్లును మాత్రం తేవాలని అన్నారు. దేశవ్యాప్తంగా తన దీక్షకు మద్దతు తెలుపుతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదీనంలో ఉన్న సిబిఐలాంటి సంస్థ కూడా అవినీతిని తగ్గించడంలో విఫలం చెందాయని ఆరోపించారు. ఈ నెల 12నుండి జైల్ భరో కార్యక్రమానికి అన్నాహజారే దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం అన్నాహజారే మూడు డిమాండ్లకు ఒప్పుకుంది. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మరో మారు అన్నాహజారే వర్గంతో చర్చలు జరపనున్నారు.

కాగా అన్నాహజారే దీక్షకు క్రికెటర్లు, సినిమా తారలు మద్దతు ప్రకటించాలని అనుపమ్ ఖేర్ అన్నారు. శుక్రవారం అన్నాహజారే దీక్ష స్థలికి వచ్చి అనుపమ్ మద్దతు పలికారు. అవినీతినుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాదులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములు యూత్ ఫర్ బెట్టర్ ఇండియా ఆధ్వర్యంలో అన్నహాజరే దీక్షకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. కాగా అన్నాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.

English summary
Anna Hazare questioned government that any one corruptionist was sentenced before. He confirmed he was not in any committee before, never future. He felt very happy with public support to his fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X