వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాహజారే దెబ్బకు దిగి వచ్చిన కేంద్రం: అయినా వీడని ముడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: అవినీతిని అడ్డుకోవడానికి లోక్ జన్‌పాల్ బిల్లును తీసుకు రావాలని గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. అన్నాహజారేకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ఠారెత్తిన కేంద్రం ఎట్టకేలకు దిగి వచ్చింది. అన్నాహజారే డిమాండ్‌లను ఒప్పుకుంటున్నట్లుగా తెలిపింది. అన్నాహజారే మద్దతుదారుడు స్వామి అగ్నివేష్‌ను చర్చలకు ఆహ్వానించింది. హజారే దీక్ష తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం ఎన్నికలలో ప్రభావం పడుతుందని భావించి దిగివచ్చినట్లుగా తెలుస్తోంది.

కాగా లోక్‌పాల్ బిల్లు ప్రతిని స్వామి అగ్నివేష్‌కు కేంద్రం పంపించింది. సాయంత్రం చర్చలకు రమ్మని ఆహ్వానించింది. వచ్చే పార్లమెంటు సమావేశాలలో లోక్‌పాల్ బిల్లును పెట్టడానికి అంగీకరించింది. లోక్‌పాల్ బిల్లుపై జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది. కమిటీలో 10 మంది ఉంటారు. అందులో 5గురు సామాజిక, క్రియాశీలక కార్యకర్తలను నియమించేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్యానల్ కన్వీనర్‌గా కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఉంటారు. కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని చెప్పారు.

ప్రజావాణికి కేంద్రం దిగి వచ్చినప్పటికీ అన్నాహజారే పెట్టిన ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లపై కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదని తెలుస్తోంది. అందులో నోటిఫికేషన్ జారీ చేయడం ఒకటి కాగా, చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జెఎస్ వర్మని తీసుకోవాలని రెండు డిమాండ్లపై నోరు మెదపడం లేదు. అయితే అన్ని డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకుంటే దీక్ష విరమించేది లేదని అన్నా చెబుతున్నారు. కేంద్ర ప్రతిపాదనలను అన్నా హజారే తిరస్కరించారు. కాగా అన్నాహజారేతో పాటు దీక్ష చేపట్టిన 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
Central government step back on Lokpal bill with Anna Hazare fast. Centre welcomes Swami Agnivesh to talk on bill. Centre said they will ready to make Joint drafting committee on Lokpal bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X