• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హజారే పోరులో మోహన్ బాబు, రాణా, ఇతర సినీ ప్రముఖులు

By Pratap
|

హైదరాబాద్: అవినీతిని అరికట్టేందుకు జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదించాలని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే పోరుకు తెలుగు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు శుక్రవారం తిరుపతిలో విద్యార్థులతో యాత్ర నిర్వహించారు. హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ హజారేకు మద్దతుగా శుక్రవారం వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాలు పంచుకున్నారు.

హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద యూత్ ఫర్ బెట్టర్ ఇండియా, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో సినీ నటులు దగ్గుబాటి రాణా, శివాజీ, దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాదు శాఖ ధర్నా నిర్వహించింది.

English summary
Rallies and fasts were organized across Andhra Pradesh in support of veteran social activist Anna Hazare's fast-unto-death in New Delhi for a stronger anti-corruption Lokpal Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X