హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలాగైతే మాట్లాడను: మీడియాపై అలిగిన మంత్రి శంకర్‌రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖమాత్యులు శంకర్‌రావు సోమవారం మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తాను తన వ్యక్తిగత కార్యదర్శిని కొట్టాననడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొన్ని టీవీ ఛానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు. తాను ఎవరినీ కొట్టలేదన్నారు. అవి కంప్యూటర్‌తో మార్ఫింగ్ చేసినవి అన్నారు. మార్ఫింగ్ ద్వారా తనను బ్లేమ్ చేయాలని చూస్తున్నారన్నారు. తనపై ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.

ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రసారం చేసినందువల్ల ఇక నుండి తాను మీడియాతో మాట్లాడనని చెప్పారు. ఏదైనా చెప్పదల్చుకుంటే రాతపూర్వకంగా ఇస్తానని చెప్పారు. కాగా చేనేత సంఘాలకు ఈ నెల 31వ తారీఖు లోగా బకాయి నిధులు విడుదల చేయిస్తానని మంత్రి చెప్పారు. అలా చేయకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గాంధీ భవన్, ఎపి భవన్‌లో చేనేత వస్త్రాల విక్రయానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరతానని చెప్పారు.

English summary
Minister Shankar Rao fired at media for broadcosting slaps on his PA. He warned that he will filed criminal case against if they broadcost false news on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X