వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాద్రి రాముడికి సిఎం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మంగళవారం హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ఆయన భద్రాద్రి రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి పెద్ద యెత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామివారి దర్శనం కోసం సోమవారం అర్థ రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గోదావరి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు.

భద్రాద్రి పోలీసు చక్రబంధంలోకి వెళ్లింది. పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 3115మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. గతంలో ఎన్నడూలేనిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ కాంతికాణాతాతా, అదనపు ఎస్పీలు గజరావ్‌భూపాల్‌, ప్రవీణ్‌ల ఆధ్వర్యంలో 13మంది డీఎస్పీలు భద్రతా చర్యలను చూస్తున్నారు. భద్రాచలంలోకి వచ్చే వాహనాలను పట్టణంలో సరిహద్దులలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను మరీ నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ప్రముఖులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక పోలీసులు, ఆర్మ్‌డ్‌రిజర్వ్‌ పోలీసులు వాహనాల తనిఖీలతో పాటుగా, భద్రాచలం వచ్చే రహదారులలో కల్వర్టులు, అటవీ ప్రాంతాలను అణువణువూ గాలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలను నివారించేందుకు, ప్రముఖుల వాహనాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రముఖుల వాహనాల శ్రేణి(కాన్వాయ్‌)తో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ''ట్రయల్స్‌'' నిర్వహించారు.

English summary
CM Kiran Kumar Reddy presented Muthjyala Talambralu to Bhadradri Ramudu. Sitarama kalyanam has been held at Bhadrachalam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X