వైయస్ జగన్కు షాక్: డిఎల్ రవీంద్రా రెడ్డితో బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ భేటీ

కమలమ్మ మంగళవారం కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా, కడప పార్లమెంటు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిలతో ఆమె సమావేశమయ్యారు. ఆమె కాంగ్రెసులోకి తిరిగి వచ్చి డిఎల్ రవీంద్రా రెడ్డి కోసం పనిచేసే అవకాశాలున్నాయి. కమలమ్మ తప్పుకోవడం వల్ల వైయస్ జగన్కు ఏదో మేరకు నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి కొంత మంది జగన్ వర్గం శాసనసభ్యులు తమ వైపు వస్తారని డిఎల్ రవీంద్రా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే తాను కడప నుంచి లోకసభకు పోటీ చేస్తున్నట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.