కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు మరో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఝలక్, తిరిగి కాంగ్రెసులోకి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కడప జిల్లా రైల్వో కోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు కూడా బద్వేలు శానససభ్యురాలు కమలమ్మ బాటలో నడుస్తారని అంటున్నారు. వైయస్ జగన్‌కు గుడ్‌బై చెప్పి ఆయన తిరిగి కాంగ్రెసులోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీనివాసులును తిరిగి కాంగ్రెసులోకి తీసుకుని రావడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు, అవి ఫలించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. శ్రీనివాసులు మొదటి నుంచి వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారు. శ్రీనివాసులు కూడా తిరిగి కాంగ్రెసులోకి వెళ్లిపోతే జగన్‌కు కష్టకాలం ప్రారంభం కావచ్చు. జగన్‌ పార్టీలో దళితులకు, బలహీన వర్గాలకు స్థానం ఉండదనే విమర్శలు ముమ్మరం కావచ్చు.

కమలమ్మ బద్వేలు నియోజకవర్గంలో జగన్ వర్గం నాయకుడు గోవింద రెడ్డితో పొసగక తిరిగి కాంగ్రెసులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఉప ఎన్నికలలో కూడా గోవిందరెడ్డితో కలిసి ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ పనిచేయాలని జగన్ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, వై.వి. సుబ్బారెడ్డిలు ఆమె స్వగహంలో చర్చలు జరిపి కాంగ్రెస్‌కు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని కోరారు. జగన్‌ వర్గంలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని, ఆమె ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆమె వినకుండా తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు.

English summary
It is learnt that Railway Koduru MLA Srinivasulu may give shock to YSR Congress leader YS Jagan. It is said that Srinivasulu may take reentry into Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X