హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూనియర్ ఎన్టీఆర్‌తో వల్లభనేని వంశీ రహస్య మంతనాలు, మతలబు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi-Jr NTR
హైదరాబాద్: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మంగళవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాదుకు వచ్చిన వంశీ మంగళవారం జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశమైనట్లు చెబుతున్నారు. వంశీ జూనియర్ ఎన్టీఆర్‌తో ఏం మాట్లాడారనేది తెలియడం లేదు. భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికే వంశీ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారా అనేది కూడా తెలియడం లేదు. వంశీ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా పర్యటనలో దేవినేని ఉమా మహేశ్వర రావు నందమూరి హరికృష్ణను అవమానించారని ఆరోపిస్తూ వంశీ, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానీ తిరుగుబాటు బావుటా ఎగురేశారు. అయితే, తాను చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయబోనని కొడాలి నానీ ప్రకటించారు. కొడాలి నానీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆంతరంగికుడు. జూనియర్ ఎన్టీఆర్‌కూ నారా లోకేష్‌కు మధ్య వారసత్వ పోరు జరగడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరో పది పదిహేనేళ్లు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కొనసాగుతారని ఆయన చెప్పారు.

కొడాలి నానీ గానీ వంశీ గానీ చెబుతున్న మాటలను బట్టి ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా లేరనే విషయం అర్థమవుతోంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ద్వారా లోకేష్‌కు చెక్ పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. తెర వెనక కథను స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నడిపిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వంశీ జూనియర్ ఎన్టీఆర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు.

English summary
It is said that Vallabhaneni Vamshi has met Cine hero, Harikrishna's son Jr NTR. It is said that secret talks were held between the two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X