పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ వర్సెస్ వైయస్ ఫ్యామిలీ
State
oi-Pratapreddy
By Pratap
|
కడప: పులివెందుల శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి మధ్య పోరుగా మారింది. ఇరు కుటుంబాల సభ్యులు విస్తృతంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, వివేకానంద రెడ్డి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ పడుతున్న పడుతున్న విషయం తెలిసిందే. వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబం ఓ వైపు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ మరో వైపు ఉండి ప్రచారం సాగిస్తున్నాయి.
వైయస్ విజయమ్మ గెలుపు బాధ్యతను వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళా రెడ్డి తన భుజాన వేసుకున్నారు. విజయమ్మ తరఫున వైయస్ జగన్ భార్య భారతీ రెడ్డి, మామ గంగిరెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి సోదరులు మనోహర్ రెడ్డి, ఆనంద రెడ్డి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి తరఫున ఆయన భార్య సౌభాగ్యమ్మ, ఆయన అల్లుడు, కూతురు ప్రచారం సాగిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ కడప లోకసభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
YS Vivekananda Reddy family members and YS Reddy family members are campaigning in Pulivendula assembly segment from two opposite parties. YS Jagan wife Barathi Reddy participated in election campaign.
Story first published: Tuesday, April 12, 2011, 15:22 [IST]