చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాట రూ.40కోట్లు పట్టుకున్న ఈసీ: ఓటు వేసిన రజనీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళనాడులో ఓటర్లను మభ్య పెట్టడానికి పార్టీలు భారీగా డబ్బులు వెదజల్లుతున్నాయి. ఎన్నికల ముందు వరకు సుమారు కోట్లాది రూపాయలను పట్టుకున్న ఎన్నికల సంఘం ఓటింగ్ జరుగుతున్న బుధవారం రోజు ఒక్కరోజే సుమారు రూ.40 కోట్లను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

అయితే తమిళనాడు పార్టీలు వెదజల్లిన డబ్బు మరే రాష్ట్రంలో కనిపించక పోవడం విశేషం. ఈసి పట్టుకున్న సుమారు అరవై కోట్ల రూపాయలలో మూడు వంతుల వరకు ఒక్క తమిళనాడుదే కావడం విశేషం. పార్టీలు ఒక్కో ఓటరుకు రూ.500 ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు పంచి పెట్టడానికి ఉద్యోగులు, విద్యార్థులను పార్టీలు ఉపయోగించుకోవడం శోచనీయం. కాగా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే జయలలిత, కరుణానిధిలు మాటల తుటాలు విసురుకోవడం విశేషం.

కాగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తమ ఓటు హక్కును చెన్నైలో వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత జయలలిత, ఎంపీ కనిమొళి, విజయ్‌కాంత్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

English summary
AIDMK and DMK parties distributed crores of rupees to voters. EC found Rs.40 crores on election day. Super Star Rajini, Kamal Hasan were used their vote in chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X