హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలని కెసిఆర్ ప్రయత్నాలు: రేవంత్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తాను ముఖ్యమంత్రి కావడం కోసమే చండియాగం చేశారని తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరోపించారు. గతంలో విశ్వశాంతి యాగం పేరుతో విజయశాంతిని ఎంపీగా చేశారని, ఇప్పుడు తన కోసం యాగం చేస్తున్నారని అన్నారు. ఆయన చేసేది చండియాగం మాట్లాడేది మాత్రం చండాలం అని దుయ్యబట్టారు. కెసిఆర్ తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానుకుంటే మంచిదని సూచించారు.

కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపట్టడాన్ని ఆయన ఖండించారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని అలా నడుచుకోని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కోరతానని సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నాగం ఇటీవల కడప ప్రచారానికి వెళ్లిన టిడిపి నేతలను తప్పు పట్టారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని అన్నారు. పార్టీ వెళ్లమని ఆదేశిస్తే వెళ్లవలసిందే అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదని అన్నారు. కాబట్టి పార్టీ ఆదేశాలు పాటించాల్సిందేనని చెప్పారు.

ఒకవేళ ఎవరైనా కడప ఉప ఎన్నికలకు వెళ్లడాన్ని తప్పుపడితే వారు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చినట్టేనని అన్నారు. తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను, రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌ను గెలిపించే ఉద్దేశ్యంలో అలా మాట్లాడినట్టు భావించవలసి ఉంటుందని అన్నారు. జగన్‌కు మద్దతు ఇచ్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదని హెచ్చరించారు.

కాగా త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని మరో సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అటు యుపిఏ ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ఖాయమని చెప్పారు. కె చంద్రశేఖరరావు ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలని అభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆరోపించారు.

English summary
TDP young MLA Revanth Reddy and Gali Muddukrishnama Naidu fired at TRS president K Chandrasekhar Rao. They said KCR wants to became AP CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X