హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna Committee
హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంపై న్యాయవాది వలీలూర్ రెహ్మాన్ కోర్టుకు వెళ్లారు. రహస్యంగా ఉంచిన ఎనిమిదో అధ్యాయంలో తెలంగాణవారిని అవమానించే విధంగా కమిటీ వ్యాఖ్యలు చేసిందని రెహ్మాన్ ఆరోపించారు. అంతేకాకుండా, సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు మధ్య తగాదాలు పెట్టే విధంగా నివేదిక ఎనిమిదో అధ్యాయం అంశాలున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు.

శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి తమకు నివేదిక సమర్పించాలని నాంపల్లి కోర్టు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది. శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై 418, 153ఎ, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రెహ్మాన్ కోర్టును కోరారు. ముస్లింలకు, హిందువులకు మధ్య తగాదాలు పెంచే విధంగా కూడా నివేదిక ఉందని ఆయన ఆరోపించారు. శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్యులను అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు.

English summary
Hyderabad Nampally Court order Punjagutta police to file case against Justice Srikrishna and committee members. Court issued this orders on a petition filed by Valeelur Rehaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X