హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోరాట యోధులు పుట్టిన తెలంగాణలో పుట్టడమే సిగ్గుచేటు: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు శుక్రవారం వేరు వేరుగా ధ్వజమెత్తారు. తెలంగాణక వ్యతిరేకి అయిన మైసూరారెడ్డిని గెలిపించడం కోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఏమిటని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్‌రావు ప్రశ్నించారు. టిడిపి నేతలు రాజీనామాల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని సూచించారు. కడపలో ప్రచారం చేస్తే తెలంగాణ వ్యతిరేకులే అని అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కాలేదా అని ప్రశ్నించారు.

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో భాగంగానే ప్రభుత్వం 177 చట్టం తీసుకు వచ్చిందన్నారు. 177 చట్టంని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హరీష్‌రావు హెచ్చరించారు. విలీనం దిశలో టిడిపియే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. టిడిపి నేతలు టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్‌ను విమర్శించడం మానుకోవాలని అన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

కాగా పోరాట యోధులు పుట్టిన గడ్డపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకరరావులు పుట్టడం సిగ్గు చేటు అని సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అధికార కాంగ్రెసు ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాంబర్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

English summary
TRS MLAs Harish Rao and KT Ramarao fired at minister Ponnala Laxmaiah, TDP MLA Errabelli Dayakar Rao. They opposing Telangana TDP campainging in Kadapa by-pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X