హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరవద్దు: టి-కాంగ్రెసు ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress party
హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకి అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహ్ రెడ్డి పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండాను తెలంగాణలో ఎగరకుండా చూడాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఆదివారం హెచ్చరించారు. ఆదివారం హైదరాబాదులో భేటీ అయిన అనంతరం పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో జగన్ ఫ్లకార్డు పట్టుకున్నారని అప్పుడే ఆయన తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ ప్రజలకు అర్థమై పోయిందన్నారు.

తెలంగాణపై కడప ఉప ఎన్నికల అనంతరం కాకుండా ఎన్నికలకు ముందే తెలంగాణపై తన పార్టీ అభిప్రాయాన్ని వెలువర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన ఉద్దేశ్యం చెప్పాలన్నారు. జగన్ పార్టీ జెండాలు తెలంగాణలో ఎగురవేసిన వారు తెలంగాణ వ్యతిరేకులే అన్నారు. అయినా జగన్ పార్టీ అభిప్రాయం అవసరం కూడా లేదని అన్నారు. ప్రచారానికి ఎవరు వెళతారనే విషయంతో తమకు సంబంధం లేదన్నారు. అయితే ఎవరు గెలిచినా తెలంగాణకు వ్యతిరేకులే అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లవద్దని వారు ప్రభుత్వానికి సూచించారు. 8వ చాప్టర్ ను వెంటనే బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ వ్యక్తి అయినందునే తెలంగాణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారనటం సరికాదు. ఆయనను టార్గెట్ చేయడం సీమాంధ్రులకు సరికాదన్నారు.

English summary
T-Congress MPs demanded Ex MP YS Jaganmohan Reddy stand on Telangana before by-pole. They suggested government to not appeal high court's judgement on Srikrishna's 8th chapter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X