వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బప్పి లహరిని కాపీ కొట్టిన జెన్నీఫర్ లోపెజ్: లంబాడీ బాణీలో ఆన్ ది ఫ్లోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bappi Lahiri
ముంబై: పాప్ క్వీన్, ప్రపంచ అందగత్తెగా ఇటీవలే ఎంపికైన జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల విడుదల చేసిన ఆన్ ద ఫ్లోర్ అసలు బాణీ తనదేనని ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి వాదిస్తున్నారు. 1990లో ఘనవిజయం సాధించిన ఘాయల్ చిత్రంలోని సోచ్‌నా క్యా జో భీ హోగా దేఖా జాయేగా పాట బాణీకి అది పూర్తి కాపీ అని ఆయన అంటున్నారు. ఈ పాట తెలుగులో తెల్ల చీరకు తకధిమి తపనలు సాగేనమ్మా సందె వేళల్లో ఇలా సాగుతుంది. లంబాడా తరహా బీట్ ఉన్న ఆన్ ద ఫ్లోర్ ప్రారంభం అంతా తన పాటనే పోలి ఉందని ఆయన అంటున్నారు.

తాను రెండు దశాబ్దాల క్రితం సంవత్సరాల కిందటే భారతదేశంలో లంబాడా సంగీతాన్ని అందిస్తే ఆమె ఇప్పుడు చేసిందని, అందువల్ల దాని ఘనత అంతా తన కు మాత్రమే దక్కాలని బప్పిలహరి అంటున్నారు. శరీరం నిండా బంగారు ఆభరణాలు ధరించి కదిలే నగల దుకాణంలా సందడి చేసే లహరి త్వరలోనే రాకింగ్ దర్దే డిస్కో అనే చిత్రంలో నటించబోతున్నారంట. ఆ విషయాలను ఆయనే ధృవీకరించారు.

English summary
Veteran music composer-cum-singer Bappi Lahiri has claimed credit for the success of pop diva Jennifer Lopez's latest track 'On The Floor' saying that its tune is similar to his song 'Sochana Kya' from the 1990 blockbuster 'Ghayal'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X