వైయస్ జగన్ ప్రచారం: కాసేపు ఆగిపోయిన మంత్రి డిఎల్ కాన్వాయ్
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా కడప జిల్లాలోని ఓ గ్రామం పరిసరాల్లో మంత్రి, కాంగ్రెసు కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మరో మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్ కాసేపు అగిపోయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం తాటిగొట్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి కాన్వాయ్ అటుగా వచ్చింది. అయితే జగన్ అక్కడ ప్రచారం నిర్వహిస్తుండటంతో వీరి కాన్వాయ్ కాసేపు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరి తిరిగి తమ ప్రచారానికి బయలు దేరారు.
Ministers DL Ravindra Reddy and Raghuveera Reddy convey stopped by Ex MP YS Jaganmohan Reddy campaigning in Thatigotla village of Kadapa district today.
Story first published: Monday, April 18, 2011, 12:05 [IST]