కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఉప ఎన్నికలు మార్పునకు నాంది: వైయస్ జగన్ ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప ఉప ఎన్నికలు మార్పునకు నాంది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ స్థానం అభ్యర్థి వైయస్ జగన్ అన్నారు. ఆయన సోమవారం కడప లోకసభ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగాల్లో ఆయన కాంగ్రెసు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఆయన విమర్సించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు.

వైయస్సార్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని, అందువల్లనే కడపకు ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అన్నారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఉండకపోతే ఉప ఎన్నికలు వచ్చేవి కావని, నైతిక విలువలకు కట్టుబడే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని ఆయన వివరించారు.

English summary
YSR Congress party president and Kadapa loksabha candidate YS Jagan lashed out at Congress. He said that Congress leaders are trying to tarnish YSR image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X