హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు కెసిఆర్ బాసట: చంద్రబాబుకు పరోక్ష చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చురకలు అంటున్నారు. వైయస్ జగన్‌పై తాను ఆరోపణలు చేయబోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వైయస్ జగన్‌వి అక్రమాస్తులు అంటున్నవారు అందుకు ఆధారాలు చూపుతున్నారా ఆయన అడిగారు. కుంట భూమి లేనివారు కోట్లకు పడగలెత్తారని తెలుగుదేశం పార్టీవారే అంటున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు

తాను పుట్టినప్పుడే తన కుటుంబానికి 500 ఎకరాలకు పైగా ఉందని, తనపై తెలుగుదేశం పార్టీవారు ఆరోపణలు చేయడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబునాయుడిని ఒప్పించలేని తెలుగుదేశం తెలంగాణ నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, సూర్యుడిపై ఉమ్మేస్తే ముఖంపైనే పడుతుందని ఆయన అన్నారు. నోరుదని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు కాదని, ప్రజలకు అందరి చరిత్రలు తెలుసునని ఆయన అన్నారు.

బాన్సువాడకు ఉప ఎన్నిక రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుట్ర చేశారని, ప్రచారం చేసే ముఖం లేక పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదం పొందకుండా చూస్తున్నారని ఆయన విమర్సించారు. వారిద్దరు పచ్చి మోసగాళ్లని ఆయన అన్నారు. తాను ఆంధ్ర బ్రాహ్మణులను కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర బ్రాహ్మణులతో తనకు వైషమ్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బ్రాహ్మణులు నిష్టగా పూజలు చేస్తారని, ఆంధ్ర బ్రాహ్మణలకు ఆడంబరం ఎక్కువ అని మాత్రమే తాను అన్నట్లు ఆయన తెలిపారు. జీవో నెంబర్ 177ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TRS president K Chandrasekhar Rao supported YS Jagan and opposed TDP president Chandrababu Naidu. He said that he will not make allegations against YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X