వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగు పడుతుందని చెప్పలేం: బాబా ఆరోగ్యంపై రమేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యంపై సిమ్స్ డాక్టర్లు గానీ, ప్రభుత్వ వైద్యాధికారి గానీ చెప్పే వివరణలు సరిగా ఉండటం లేదు. డాక్టర్లు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం బాబా ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేస్తున్నప్పటికీ చెప్పిందే చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. దీనికి తోడుగా మీడియాలో బాబాను బందీ చేశారని, బాబా చుట్టు అక్రమ కోటరి ఉందని వస్తున్న వార్తలు చదివిన భక్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. బాబా ఆరోగ్యంపై సిమ్స్ డైరెక్టర్ సఫయాగానీ, ప్రభుత్వ వైద్యాధికారి రవిరాజ్ కానీ ఇచ్చే బులెటిన్‌లతో భక్తులకు ఊరట కలిగించక పోవడమే కాకుండా మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రోజూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయినా ఆందోళనకరంగా లేదని చెప్పలేమని, ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామని కాలేయం పని తీరు మెరుగు పడిందని మళ్లీ తరువాతి రోజే కాలేయం పనితీరు నెమ్మదిగా ఉందని చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పి తాజాగా అవయవాల పనితీరు మందగించిందని పొంతన లేని మాటలు చెపుతున్నారు.

డాక్టర్ సఫయా, రవిరాజ్‌ల బులెటిన్‌కు భిన్నంగా మంగళవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ రమేష్ మరో విధంగా చెప్పారు. బాబా కోమాలోకి వెళ్లారని చెప్పారు. వెంటిలెటర్ ద్వారానే శ్వాస అందిస్తున్నట్టు చెప్పారు. ఇంకా సపోర్టు సిస్టమ్స్ ద్వారానే బాబా అవయవాలు పని చేస్తున్నాయని, బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే 85 ఏళ్ల బాబా ఆరోగ్యం మెరుగు పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని భక్తులను మరింత ఆందోళనకు గురి చేశారు.

English summary
Doctors creating a suspence on Bhagvan Sri Sathya Sai health. There is no clarity in doctors statements. Government health secretary Ramesh said today that Baba health is critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X