హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వానికి సుప్రీంకోర్టులు మొట్టికాయలు తప్పవు: నాగం జనార్ధన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా మొట్టికాయలు తప్పవని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం తెలంగాణ జెఏసి నాయకులు నాగంను కలిశారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై హైకోర్టులో చుక్కెదురయిందని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తే బావుండేదన్నారు. అయితే ప్రభుత్వం హైకోర్టు నిర్ణయంతో విభేదిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం విచారకరమన్నారు. అయితే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని హెచ్చరించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం 8వ అధ్యాయాన్ని ప్రజల ముందు పెడితే బావుంటుందని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ప్రభుత్వం 177 చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే తీవ్ర ఆందోళనలకు దిగుతామని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడం చేస్తామని చెప్పారు.

English summary
TDP senior leader Nagam Janardhan Reddy said today that supreme court will give shock to government on srikrishna committee 8th chapter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X