విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూజివీడు ట్రిపుల్ ఐటి తెలుగు అమ్మాయికి నాసా ఆహ్వానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kusuma Priya
విజయవాడ: నాసా నిర్వహించిన 'ఆర్బిటాల్-స్పేస్ సెటిల్‌మెంట్ 2011" పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని కుసుమప్రియ ప్రాజెక్టు ఎంపికైంది. మే18 నుంచి 22 వరకు అమెరికాలోని అలబామా రాష్ట్రం హంట్స్‌విల్‌లో జరిగే ఐఎస్‌డీసి (ఇంటర్నల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్)లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న కొంతేటి కుసుమప్రియ 'డ్రీమ్ ప్యారడైజ్ ప్రాజెక్టు"ను ఈ పోటీలకు పంపారు.

విశ్వం లో మానవ నిర్మిత నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలతో కుసుమప్రియ తన ప్రాజెక్టును రూపొందించారు. నాసాకు తమ విద్యార్థి కుసుమప్రియ ఎంపికగావడం ఎంతో సంతోషంగా ఉందని ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కుసుమప్రియ తండ్రి చంద్రశేఖర్‌ ఇటుకలు విక్రయించే వ్యాపారి.

English summary
NASA invited Telugu girl Kusumapriya to present her project. She is studying at Nuziveedu tripple IT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X