అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబా పరిస్థితి ఆందోళనకరమే: ప్రత్యక్షంగా చూసిన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని బాబాను ప్రత్యక్షంగా చూసిన అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్ధన్ రెడ్డి గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. బాబాను తాను ప్రత్యక్షంగా చూశానని, శ్వాస పీల్చుకోవడం సాయికి కష్టంగా ఉందని చెప్పారు. బాబా అవయవాలు చికిత్సకు కూడా ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి ఆందోళనకరంగానే ఉందని అన్నారు.

కాగా మంగళవారం సాయంత్రం నుండి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి పూట పూటకు విషమిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మంత్రి రఘువీరా రెడ్డి సైతం బాబా ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో ప్రశాంతి నిలయం వద్ద వెయ్యి మంది పోలీసులను పహారా ఉంచారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టపర్తి వెళ్లనున్నారు. రేపు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

English summary
Anantapur district collector Janardhan Reddy said today that Bhagvan Sri Sathya Sai health is very critical. He said Baba body parts are not responding for hospitality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X